కేంద్రపాలిత ప్రాంతం యానాంలో 70వేల జనాభ,18వేల వాహనాలు..15 పెట్రోల్ బంకులు ఉండగా.. మరో 12 ఏర్పాటు చేస్తుంది ఆంధ్ర ప్రాతంతో పోల్చితే యానాంలో డీజిల్, పెట్రోల్ ధరలు రూ,14 తక్కువగా ఉండటమే ఇందుకు ప్రదాన కారణం. యానాం నుండి కొందరు వ్యక్తులు అక్రమంగా డీజిల్, పెట్రోల్ ఇతర ప్రాంతాలకు తరలిస్తూ వ్యాపారం చేస్తున్నారని.. ఇన్ని పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడానికి అదే ప్రధాన కారణమని ప్రజలు విమర్శిస్తున్నారు. యానాం నుండి పెద్ద ఎత్తున మాఫియా డీజిల్, పెట్రోల్ ట్యాంకర్లనే మాయం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి.

