అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం.
సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, నారా లోకేశ్, టీజీ భరత్, అధికారులు సింగపూర్ వెళ్లనున్నారు.

