
వింబుల్డన్‌లో మరో కొత్త ఛాంపియన్. పొలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ ఈ మెగా టోర్నీలో విజేతగా అవతవరించింది. మహిళల సింగిల్స్ ఫైనల్లో అద్భుత విజయంతో టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం ఏకపక్షంగా సాగిన రెండు సెట్లలో జోరు చూపించిన పొలాండ్ భామ అమెరికా సంచలనం అమందా అనిస్మోవాకు చెక్ పెట్టింది. మొత్తంగా ఆమెకిది ఆరో గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇక తొలిసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అమెరికా ప్లేయర్ అమందా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.