
గగన్‌యాన్ మిషన్‌కు చెందిన కీలక పరీక్షను ఇస్రో(ISRO) విజయవంతంగా పూర్తి చేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను పూర్తిగా డెవలప్ చేసిన ఇస్రో.. క్వాలిఫికేషన్ టెస్ట్ ప్రోగ్రామ్ ద్వారా సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను సమగ్రంగా పరీక్షించింది. ఎస్ఎంపీఎస్కు చెందిన 350 సెకన్ల ఫుల్ డ్యూరేషన్ హాట్ టెస్ట్‌ను శుక్రవారం పూర్తి చేశారు.హాట్ టెస్ట్ సమయంలో ప్రొపల్షన్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ నార్మల్‌గా సాగిందని ఇస్రో ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది.