
ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ యాపిల్ చీఫ్ ఆఫరేటింగ్ ఆఫీసర్‌గా సబీ ఖాన్ నియమితులయ్యారు. ఆయన ఈ నెలాఖరులో ఈ పదవిని స్వీకరిస్తారు.జెఫ్ విలియమ్స్ స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. సబీఖాన్ భారత సంతతి వ్యక్తి. సబీ ఖాన్ 1966లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జన్మించారు. ఆయన ఐదో తరగతిలో ఉన్నప్పుడు ఆయన కుటుంబం సింగపూర్‌కు వలస వెళ్లింది, ఆ తర్వాత వారు యునైటెడ్ స్టేట్స్లో స్థిరపడ్డారు