టీటీడీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏ.రాజశేఖర్ బాబు పుత్తూరులోని స్వగ్రామంలో ప్రతీ ఆదివారం స్థానిక చర్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారని సమాచారం . హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగి అయివుండి భాద్యతారహితంగా వ్యవహరించడం జరిగింది. మరోవైపు టీటీడీ విజిలెన్స్ విచారణలోనూ ఏఈవో రాజశేఖర్ బాబు చర్చికి వెళ్తున్నట్లు నిర్ధారించడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించడంతోపాటు సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది అని టీటీడీ తెలిపింది.

