కన్నడనాట రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. పైకి అంతా బాగానే ఉన్నట్లు నటిస్తున్నా.. సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎంగా పరిస్థితి సాగతుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ సీఎం కావాలని అంటున్నారు. మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకే మద్ధతుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు డీకే.. నాయకత్వం మార్పు ఏమి ఉండదని తొలుత వ్యాఖ్యానించి.. తాజాగా సీఎం కావాలనే ఆశ ఎవరికి ఉండదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

