ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ పరిస్థితి అట్టడుగు స్థాయికి దిగజారిందనడానికి తాజా ఉదంతమే నిదర్శనం. రాష్ట్రంలోని చాలా ఫైరింజన్లు వయస్సు మళ్లిన వాహనాలే. ఇప్పటి వరకు ఉన్న 230 ఫైరింజన్లలో 60 శాతానికి పైగా పాతవే. రవాణా శాఖ సూచనల మేరకు వాటికి ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం నిలిపేశారు. కేంద్రం రూ.58 కోట్లు విడుదల చేయగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.17 కోట్లు చెల్లించింది. మొత్తం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ ప్రారంభించలేదు. ఇది అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

