బ్యాంక్ ఆఫ్ బరోడా పొదుపు ఖాతాదారులకు పెద్ద ఉపశమనం కల్పించింది. ఇప్పుడు వినియోగదారులు పొదుపు ఖాతాలో కనీస బ్యాలెన్స్ మెయింటెన్ చేయాల్సిన అవసరం లేదు. అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా ఎలాంటి జరిమానా ఉండదు. గతంలో కెనరా బ్యాంక్, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ కూడా తమ కస్టమర్లకు ఈ సౌకర్యాన్ని అందించాయి. ప్రీమియం పొదుపు ఖాతా పథకాలపై ఈ తగ్గింపు వర్తించదని గుర్తుంచుకోండి.

