త్వరలోనే జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నేతలు తాయిలాలతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వరాల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంగళవారం సంచలన ప్రకటనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలోని అన్ని వర్గాల్లోని మహిళలకు ఏకంగా 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటించారు. బీహార్ శాశ్వత నివాసితులుగా ఉన్న మహిళలకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులలో అన్ని వర్గాలు, స్థాయిలు, రకాల పోస్టులకు ప్రత్యక్ష నియామకాలలో ఈ రిజర్వేషన్ వర్తిస్తుందని ఆయన తెలిపారు.

