
బ్రిక్స్ సమ్మిట్లో శాంతి, భద్రత, గ్లోబల్ గవర్నెన్స్ సంస్కరణలపై ప్లీనరీ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గ్లోబల్ సౌత్ ఎదుర్కొంటున్న నిర్లక్ష్యాన్ని హైలైట్ చేశారు. “గ్లోబల్ సౌత్ తరచుగా డబుల్ స్టాండర్డ్స్ కు గురైంది. అభివృద్ధి, వనరుల పంపిణీ లేదా భద్రత సంబంధిత సమస్యల గురించి గ్లోబల్ సౌత్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. వాతావరణ ఆర్థిక సహాయం, స్థిరమైన అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం వంటి సమస్యలపై, గ్లోబల్ సౌత్ తరచుగా కేవలం గుర్తుగా మాత్రమే మిగిలిపోయింది” అని అన్నారు.