
బర్మింగ్‌హమ్‌లో భారత జట్టు చరిత్ర సృష్టించింది. బజ్ బాల్ ఆటతో ప్రత్యర్థుల భరతం పట్టే ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(269, 161) విధ్వంసక బ్యాటింగ్‌కు..ఆకాశ్ దీప్(6-99), సిరాజ్() అద్భత బౌలింగ్ తోడవ్వగా చరిత్రలో నిలిపోయే విక్టరీ సాధించింది. ఆల్‌రౌండ్ షోతో ఆతథ్య జట్టును వణికించిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్ బృందంపై 366 పరుగులతో చిరస్మరణీయ విజయం సాధించింది. ఐదు టెస్టుల అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో బోణీ కొట్టింది.