
భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) లోని ప్రసిద్ధ కుపోలా విండోలోకి ప్రవేశించారు. అందులో నుంచి బయటకు చూస్తూ శుక్లా చిరునవ్వుతో మెరిసిపోతూ కనిపిస్తున్నాడు.
ప్రస్తుతం 14 రోజుల అంతరిక్ష యాత్ర చివరి దశలో శాస్త్రీయ ప్రయోగాల్లో శుక్లా నిమగ్నమయ్యారు. రాకేశ్ శర్మ తర్వాత రోదసీలోకి వెళ్లిన రెండో భారతీయుడిగా.. ఐఎస్ఎస్‌లో ప్రవేశించిన మొదటి ఇండియన్‌గా శుక్లా చరిత్ర సృష్టించారు.