
క్రికెట్ అభిమానులంతా ఆశ్చర్యపోయే విధంగా ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో గిల్, రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏకంగా 346 పరుగులు చేసి, భారత్ తరఫున ఒక టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గతంలో దిగ్గజ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్‌లు నెలకొల్పిన రికార్డులను కూడా దాటేశాయి. అంతేకాదు కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ చేసిన 293 పరుగుల రికార్డును కూడా గిల్ బద్దలు కొట్టాడు.