
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. వేములవాడ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన చెన్నమనేని రమేష్ తన ఓటు హక్కును కోల్పోయారు. ఇటీవల హైకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఆధారంగా ఆయన భారత పౌరుడు కాదని తేలింది. దీంతో ఎన్నికల అధికారులు అతని పేరును వేములవాడ ఓటరు జాబితా నుంచి తొలగించారు. ఈ అంశంపై అధికారులు మరింత స్పష్టత ఇచ్చారు. చెన్నమనేని నివాసానికి నోటీసులు అంటించారు.