
మహారాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు నెలకొంటున్నాయి. రెండు దశాబ్దాల తర్వాత అన్నదమ్ములు ఇద్దరూ ఒకే వేదికపై కనిపించారు. .ఉద్ధవ్ థాక్రే, రాజ్ థాక్రే. ఒకొరిని ఒకరు హగ్ చేసుకోవడం అక్కడ ఉన్నవారిని ఆకట్టుకుంది. 2005లో చివరిసారిగా ఒకే వేదికపై కలిసి కనిపించిన ఈ ఇద్దరూ.. మళ్లీ 20 ఏళ్ల తర్వాత కనిపించారు. 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని బోధించాలని ఉత్తర్వుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్దవ్, రాజ్ సంయుక్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. ముంబై పట్టణంలోని వర్లీలో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు.