రైతురాజ్యంపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. డేట్, టైమ్, ప్లేస్ మీరు చెప్తారా? మమ్మల్ని చెప్పమంటారా అంటూ ప్రశ్నించారు? 72 గంటలు టైం ఇస్తున్నామని.. ప్రిపేర్ అయి రావాలంటూ సెటైర్లు వేశారు. అంతేకాకుండా రేవంత్ సవాల్ నుంచి పారిపోకుండా చర్చకు రావాలని కోరారు. ‘‘8వ తేదీన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌కు మేం వస్తాం. ఆ రోజు 11గంటలకు మీరు రండి. ఒక్కరుగా వచ్చినా.. గుంపుగా వచ్చినా మేం రెడీ. పాలు ఏంటో, నీళ్లు ఏంటో తేలుద్దాం’’ అంటూ కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.

