
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లి కస్తూర్బా బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని 17 మందికి అస్వస్థత గురయ్యారు. విద్యార్థులకు వాంతులు విరేచనాలు రావడంతో.. వెంటనే గుట్టుచప్పుడు కాకుండా వసతి గృహంలోనే వైద్య చికిత్స అందించారు. అంతేకాదు పిల్లల ఏమయ్యిందో కనీసం వారి తల్లిదండ్రులకు కూడా తెలియనివ్వలేదు.. తల్లిదండ్రులను పిల్లలతో కలవనీయకపోవడంతో.. ఏమయ్యిందో తెలియక అయోమయానికి గురయ్యారు.