
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మన్నవ గ్రామపంచాయతీ సర్పంచ్ బొనిగల నాగమల్లేశ్వరరావుపై ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా ప్రత్యర్థులు దాడి చేశారు. టీడీపీ నేతలే హత్యాయత్నం చేశారని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబును ట్యాగ్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు.