
దేశవ్యాప్తంగా అనేక మెడికల్ కాలేజీలను తనిఖీ చేయాల్సిన నేషనల్ మెడికల్ కమిషన్‌లో భారీ స్కాం బయటపడింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా దేశవ్యాప్తంగా 36 మంది వైద్యులు, పలు మెడికల్ కాలేజీలపై CBI కేసు నమోదు చేసింది.
వీరిలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు వైద్యులు సైతం ఉండటం విశేషం. ఇన్స్పెక్షన్ బృందంలోని సభ్యులు మెడికల్ కాలేజీలకు వెళ్లే ముందే ఏ కాలేజీ కి వెళ్తున్నామో వారికి ముందస్తు సమాచారం ఇచ్చి వారి నుండి ఏకంగా లక్షలు కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్నారు.