UV క్రియేషన్స్ పేరుతో గుర్తు తెలియని వ్యక్తి ఒకరు మోసపూరిత ఆఫర్‌లతో నటీమణులను, వారి ప్రతినిధులను సంప్రదిస్తున్నాడని మా దృష్టికి వచ్చింది. యూవీ క్రియేషన్స్‌కు ఆ వ్యక్తితో లేదా వారి కార్యకలాపాలతో ఎటువంటి సంబంధం లేదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. మా నుండి ఏదైనా అఫిషియల్ కమ్యూనికేషన్ లేదా కాస్టింగ్ అధికారిక ఛానెల్‌ల ద్వారా మాత్రమే జరుగుతాయి ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని, అటువంటి ఆఫర్స్ గురించి నిజా నిజాలు తెలుసుకొని ముందుకు వెళ్ళాలని ఓ ప్రకటనను విడుదల చేసింది.

