
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు తన నియోజకవర్గం కుప్పంలో పలు అభివృద్ధి, సంక్షేమ పనులను ప్రారంభించారు. ఇంటింటికి టీడీపీ అనే కార్యక్రమంలో భాగంగా సీఎం కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. స్వర్ణ కుప్పం ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ప్రారంభించారు. సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా మీ ముందుకు వచ్చా. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కుప్పాన్ని తయారు చేస్తాం అని సీఎం వెల్లడించారు.