
బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) బిగ్ షాకిచ్చింది. కోర్టు ధిక్కార కేసులో షేక్ హసీనాకు బుధవారం ఐసిటి ఆరు నెలల జైలు శిక్ష విధించింది. ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దాదాపు ఏడాది క్రితం బంగ్లాదేశ్ నుండి పారిపోయి ఇండియాలో తలదాచుకుంటున్న హసీనాను దోషిగా నిర్ధారించింది. 2024 జూన్, జూలై, ఆగస్టులో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలపై క్రూరంగా అణచివేసిన ఘటనలో హసీనా పాత్ర ఉందని అభియోగం మోపింది.