
ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ ‘గేమ్ ఛేంజర్’పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. “ప్లాప్ అయ్యాక రామ్ చరణ్ ఫోన్ అయినా చేశారా?” అన్న అతని వ్యాఖ్యలపై మెగా అభిమానులు తీవ్రంగా స్పందించారు. శిరీష్‌కి వార్నింగ్ ఇచ్చే లేఖ విడుదల చేశారు. “మీరు ప్రతిసారీ హీరోపై, సినిమాపై విషం చిమ్మడం మాకు మానసికంగా బాధ కలిగిస్తోంది. ఇక ఒక్కసారి గానీ తప్పుగా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి” అంటూ హెచ్చరించారు.