
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, సైకియాట్రిస్ట్, రచయిత, మాంత్రికుడు అయిన డా. బి.వి. పట్టాభిరామ్(75) హైదరాబాద్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తన జీవితాన్ని వ్యక్తిత్వ వికాసం, మానసిక ఆరోగ్య పరిష్కారాల కోసం అంకితమిచ్చిన ఆయన, వేలాది మందికి మార్గదర్శకుడిగా నిలిచారు. విద్యార్థులు, ఉద్యోగార్థులు, కుటుంబ సలహాల కోసం ఆయన తీసిన శిక్షణా తరగతులు ప్రజాదరణ పొందాయి. ఆయన్ను విశేషంగా గుర్తించే అంశాల్లో ఒకటి హిప్నాటిజం.
ఈ రంగంలో ఎన్నో అధ్యయనాలు చేసి, ప్రజల్లోని భయాలను తగ్గించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు.