భారతదేశం జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ. 22.08 లక్షల కోట్ల జీఎస్టీ వసూలు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 9.4 శాతం ఎక్కువ. అంతేకాదు, గత ఐదేళ్లలో జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయని ప్రభుత్వం తెలిపింది. సగటు నెలవారీ వసూళ్లు రూ. 1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి.

