
హైదరాబాద్లో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ.. 2025-26 విద్యా సంత్సరానికి సంబంధించి యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీలోను అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు. కోర్సులకు సంబంధించిన అర్హతలు, ఫీజుల వివరాలు,ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు అధికారిక వెబ్సైట్ www.braouonline.in, www.braou.ac.in లో చెక్ చేసుకోవచ్చు.