
యశ్వంత్ అనే నాలుగో తరగతి విద్యార్థి గుంటూరుజిల్లా కలెక్టర్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ డే వచ్చాడు. జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశాడు. వేరే వాళ్లు మా టిఫిన్ బండిని ఖాళీ చేసేశారు. కాలువలో పడేశారు. బండి పెట్టనివ్వడం లేదు. ఆఫీసులకు చాలాసార్లు తిరిగాం. అందుకోసమే మా అమ్మ కోసం నేను వచ్చా. అమ్మ చచ్చిపోదాం అంటోంది.. మా నాన్న పట్టించుకోవడం లేదు. అందుకోసమే నేను వచ్చా. టిఫిన్ బండి పెట్టుకోవడానికి మాకు స్థలం ఇప్పించండి సారూ – యశ్వంత్