ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పలు విభాగాలలో చేపట్టిన సమీక్షల నేపథ్యంలో, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన ప్రకారం, మున్సిపల్ శాఖకు సంబంధించిన సుమారు రూ.3,000 కోట్లు పక్కదారి పడినట్టు గుర్తించారని తెలిపారు. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ప్రజలపై రూ.10 లక్షల కోట్ల అప్పు మోపారని ఆయన విమర్శించారు.

