
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అవగాన రాహిత్యంతో మాట్లాడుతున్నారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కోసమో, రేవంత్‌రెడ్డి కోసమో పని చేయదని, తెలంగాణ ప్రజల కోసమే పని చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంటే ఏమిటో ప్రధాని మోడీని చూసి తెలుసుకోవాలంటూ రేవంత్‌రెడ్డికి చురకలు వేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, నువ్వు సిద్ధమా అని రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.