
అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన రాష్ట్ర బోనాల ఉత్సవాలను దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా నిర్వహించనున్నామని లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయం కమిటీ చైర్మన్ మారుతి యాదవ్ తెలిపారు. ఢిల్లీలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం కమిటీ సభ్యులతో కలిసి ఢిల్లీ బయలుదేరివెళ్లారు. సింహావాహిని ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం నుండి లాల్ దర్వాజా మోడ్ వరకు ఊరేగింపు నిర్వహించారు.