ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ అధ్వర్యంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని “సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటికీ టీడీపీ” పేరుతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవాలనీ, పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

