
టూరిస్ట్ జోన్‌ను ప్రారంభించడానికి ఉత్తర కొరియా నియంత కిమ్ తన భార్యా, పిల్లలతో వచ్చారు. వారు ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్స్ వినియోగిస్తూ కెమెరాలకు చిక్కారు. వోన్సన్ కల్మా కోస్టల్ టూరిస్ట్ జోన్, ఉత్తర కొరియా యొక్క తూర్పు తీరంలో ఉన్న వోన్సన్లో ఉంది. కిమ్ జాంగ్ ఉన్ ఈ రిసార్ట్‌ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ రిసార్ట్ ను జూలై 1 నుండి దేశీయ సందర్శకుల కోసం తెరుస్తారు. విదేశీ పర్యాటకులకు అనుమతిపై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.