
గుంటూరులో యాంటీ నార్కొటిక్స్ డేలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. గంజాయి సాగుతో దేశాన్ని, ఏపీని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. మద్యం ఆదాయంలో రెండు శాతాన్ని గంజాయి నిర్మూలనకు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. గంజాయి, డ్రగ్స్ అమ్మేవారి ఆస్తులు కూడా జప్తు చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం సినీ సెలబ్రిటీలు ముందుకురావాలని కోరారు. గంజాయి వేరే ప్రాంతాలనుంచి తీసుకువచ్చి ఏపీలో అమ్మినా వదిలేది లేదని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు.