
‘‘నమస్కారం… నా ప్రియమైన దేశస్థులారా… ఇది ఎంతో గొప్ప ప్రయాణం. 41 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ అంతరిక్షంలోకి చేరుకున్నాం. ఇది అద్భుతమైన ప్రయాణం. మేము సెకనుకు 7.5 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతున్నాము. నా భుజాలపై ఉన్న మన తిరంగ పతాకం… మీరంతా నాతో ఉన్నారని చెబుతోంది. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేస్తున్న నా ప్రయాణం మాత్రమే కాదు. భారతదేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమానికి ప్రారంభం.మీరందరూ ఈ ప్రయాణంలో భాగం కావాలని నేను కోరుకుంటున్నాను.మీ ఛాతీ కూడా గర్వంతో ఉప్పొంగాలి. మీరందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. భారతదేశ మానవ సహిత అంతరిక్ష కార్యక్రమాన్ని కలిసి ప్రారంభిద్దాం.
జై హింద్! జై భారత్!’’