
ఏపీ పీజీఈసెట్-2025 ఫలితాలు(AP PGECET) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి (Eamcet, Mpharmacy, PharmaD) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ పీజీఈసెట్ నిర్వహించగా.. నేడు ఈ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ తన ఎక్స్ అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మసీకి సంబంధించి 13 సబ్జెక్టుల్లో నిర్వహించిన ఈ పరీక్షలో 93.55 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు తెలిపారు. మొత్తంగా 14,231 మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకోగా..1,244 మంది అర్హత సాధించారన్నారు.