
12 రోజులుగా ఆయుధాలతో యుద్ధం చేసుకున్న ఇజ్రాయెల్-ఇరాన్..ఇప్పుడు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కాల్పుల విరమణను ఇరాన్ ఉల్లంఘించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్అవీవ్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్‌పై తాము ఎలాంటి దాడులూ చేయలేదని ఇరాన్ సైనికాధికారులు వెల్లడించారు. శత్రువుల మాటలపై తమకు నమ్మకం లేదని వ్యాఖ్యానించారు. ఇప్పటికీ తమ చేతులు ట్రిగ్గర్‌పైనే ఉన్నాయని వెల్లడించారు.