తెలంగాణలోని గాంధీ భవన్ మరోసారి వినూత్న నిరసనకు వేదిక అయింది. యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెబుతూ ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆందోళన బాటపట్టారు. గొర్రెలు, మేకలను గాంధీ భవన్ ఎదుట మేపుతూ తమ డిమాండ్లు పరిష్కరించాలని నినదించారు. గొర్రెలు, మేకలకు మందులు కూడా ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటిందని ఇంకా న్యాయం చేయలేదని వాపోయారు.

