భారత ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం చేరుకున్నారు. గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాని మోదీ శనివారం విశాఖపట్నంలో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు.