
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు.
కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్లు ఎలా కేటాయిస్తే అలా అని..వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు. ఈ విషయంపై అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు హితవు పలికారు.
బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం పేర్కొన్నారు.