
వైఎస్ఆర్ సిపి పార్టీ శ్రేణులను పరామర్శిస్తే తప్పా?, ఎందుకు ఇన్ని ఆంక్షలు? అని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మొన్నటి పొదిలి పర్యటనలోనూ తనకు ఇబ్బందులు సృష్టించారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే భూస్థాపితం చేస్తారా?, రైతులను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీహార్‌ను చేయడంలో చంద్రబాబుకు మించిన గొప్ప నాయకుడు
ఎవరూ లేరని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.