రాష్ట్రంలో వ్యాపారం చేసి పన్నులు ఎగవేద్దామని అనుకుంటే ఇక కుదరదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. పన్నుల ఎగవేతకు దారులు మూసేయాలని అధికారులను ఆదేశించారు. ఆదాయార్జన శాఖలపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు రెవెన్యూ లక్ష్యాలకు సంబంధించి ముఖ్యమైన సూచనలు చేశారు. అదే సమయంలో పన్ను వసూళ్లలో వ్యాపారులు, పన్ను చెల్లింపుదారులను ఇబ్బందులకు గురి చేయొద్దని స్పష్టం చేశారు.

