ఇరాన్ లొంగిపోయే ప్రసక్తే లేదని సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీ నిర్ద్వంద్వంగా స్పష్టం చేశారు. అమెరికా సైనిక జోక్యం చేసుకునేపక్షంలో కోలుకోలేని విధంగా నష్టం కలిగించి తీరతామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కు తీవ్ర హెచ్చరిక చేశారు. ఇజ్రాయెల్ తో వివాదం మధ్య ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని ట్రంప్ జారీచేసిన బెదిరింపు తర్వాత బుధవారం సుప్రీంలీడర్ ఖుమేనీ టెలివిజన్ లో జవాబిచ్చారు. ఇరాన్ బలవంతంగా రుద్దిన యుద్ధాన్ని ధైర్యంగా ఎదుర్కొని ఇరాన్ నిలబడుతుందని ఆయన స్పష్టం చేశారు.

