
ఏటుకూరు బైపాస్ వద్ద వైఎస్ జగన్ కాన్వాయ్ ముందు వెళ్తున్న ప్రైవేటు వాహనం ఢీకొని ఓ వ్యక్తి చనిపోయారు. చనిపోయిన వ్యక్తిని చీలి సింగయ్య అనే వ్యక్తిగా గుర్తించారు. సింగయ్యను ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనటంతో చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయారని.. కారు టైరు అతని భుజం మీదుగా వెళ్లిందన్నారు. హైవే పోలీసులు సింగయ్యను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే సింగయ్య చనిపోయారని వైద్యులు ధ్రువీకరించినట్లు ఎస్పీ వెల్లడించారు.