
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. బాంబు దాడులతో ఇరు దేశాల జనజీవనం అతలాకుతలం అవుతోంది. ఇజ్రాయెల్ లో పని చేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్ బాదితులు. విరుచుకు పడుతున్న మిస్సైల్లతో ఎప్పుడేం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నామంటున్నారు జిల్లా వాసులు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో జీవనం సాగిస్తున్న నిర్మల్ జిల్లా సారంగ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం తమను కాపాడాలంటూ ఇండియన్ ఎంబసీని ఆశ్రయించింది.