
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ టీజర్ సోమవారం విడుదలైంది. గత కొన్నేళ్లుగా అప్డేట్స్ లేక ఆశాభంగానికి గురైన అభిమానులకు టీజర్ కిక్కిస్తోంది. వింటేజ్ లుక్‌లో ప్రభాస్ ఎంట్రీ, చిలిపితనంతో ఆకట్టుకున్నాడు. టీజర్ అలా వచ్చిందో లేదో యూట్యూబ్ షేక్ అయిపోయింది. 24 గంటల్లోనే ఏకంగా 59 మిలియన్ వ్యూస్‌తో రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ అవుతూ నంబర్ వన్ ప్లేస్‌లో కొనసాగుతోంది.