గద్దర్ అవార్డుల ప్రెజెంటేషన్ సినిమా నటుల, రాజకీయ నాయకుల వ్యవహారంగా మారిందని ప్రొఫెసర్ కంచ ఐలయ్య అన్నారు. తెలంగాణ సంస్కృతిని భూస్వామ్య స్థితి నుంచి ప్రజాస్వామ్య రూపంలోకి మారడంలో గణనీయ పాత్ర పోషించి, ఆడి, పాడిన వందలాది మంది కళాకారులను, ప్రజా గాయకులను, పాటల రచయితలను తెలంగాణ ప్రభుత్వం మరచిపోవడం చాలా విచారకరమని ఆయనన్నారు.

