
242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అనే విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న 242 మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్ సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. విమానంలో మాజీ సిఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం.