
రాష్ట్రంలో 67,27,164 మంది విద్యార్థులకు తల్లికి వందనం కింద రేపు నగదును ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయనుంది. 1వ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరే విద్యార్ధులకు పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. వీరికి సంబంధించిన వివరాలు అందగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఇవాళే జీవో విడుదల చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.