పోర్న్ వీడియోల్లో నటించేందుకు అమ్మాయిని ట్రాప్ చేసి, టార్చర్ చేసిన కేసు కోల్ కతాలో సంచలనం రేపుతోంది. బాధితురాలు సోదేపూర్‌కు చెందినవారు. ఆర్యన్‌తో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతిని హౌరాలోని ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. ఆర్యన్ ఖాన్, అతని తల్లి ష్వేతా ఖాన్ , సోదరి జోయా ఖాన్ ఆమెను 5-6 నెలల పాటు బంధించి పోర్న్ వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. నిరాకరించడంతో ఇనుప రాడ్‌తో కొట్టి, సిగరెట్ లతో కాల్చి, జుట్టు కత్తిరించి హింసించారు.

